మంగళవారం, 23 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 18 మార్చి 2024 (10:50 IST)

చందూ మొండేటి తో కార్తికేయ3 కు సిద్దమవుతున్న నిఖిల్ సిద్ధార్థ్

Nikhil Siddharth
హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అప్పటి నుంచి కార్తికేయ 3కి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా నిఖిల్ కార్తికేయ 3ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు.  దర్శకుడు చందూ మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్  మూడవ ఫ్రాంచైజీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది.
 
“డా. కార్తికేయ సరికొత్త సాహసం కోసం త్వరలో ఉంటుందని నిఖిల్ పేర్కొన్నారు, రెండు భాగాలకు మించి ఈ సినిమా కథ అద్భుతంగా ఉంటుందని  త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామని నిఖిల్ తెలిపారు.