తండ్రి కాబోతున్న నిఖిల్ సిద్ధార్థ.. సీమంతం ఫోటోలు వైరల్
నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించారు.
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. అతడు కథానాయకుడిగా వచ్చిన కార్తికేయ-2 సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో "స్వయంభూ" సినిమాలో నటిస్తున్నాడు.