శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (12:15 IST)

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి జీతంతో పాటు..

apsrtc bus
సంక్రాంతికి ఏపీ సర్కారు ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి జీతంతోపాటే నైట్ అలవెన్స్ ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రకటించింది. 
 
ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించగా..ఎండీ బ్రహ్మానందరెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, నరసయ్య వెల్లడించారు. మిగిలిన భత్యాలు బకాయిలతోసహా ఉద్యోగులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు ప్రకటనలో తెలిపారు.
 
ఇప్పటికే జీతాలతో పాటు అలవెన్స్‌లను కలిపి చెల్లిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. నైట్ అవుట్, డే అవుట్, ఓవర్ టైమ్ అలవెన్సులను అప్పటివరకు ఆలస్యంగా చెల్లిస్తూ వస్తోంది. ఇకపై ఇలాంటివి వుండవని ప్రకటించింది.