గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2023 (17:32 IST)

సెర్జింజన్ గూగుల్‌లో 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు?

Google
ప్రముఖ టెక్ సెర్చింజన్ గూగుల్‌లో భారీగా ఉద్యోగులను తొలగిస్తుంది. ఇప్పటికే అనేకమందిని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 30 వేల మందిని తొలగించేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరంతా సేల్స్ విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కావడం గమనార్హం. సంస్థలో ఏఐ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోతుంది. దీంతో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుంది. 
 
వివిధ ఫ్లాట్‌ఫామ్స్‌లో యాడ్స్ విధానాన్ని సరళీకృతం చేసేందుకు గూగుల్ మెషీన్ లెర్నింగ్ సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతుంది. కొత్తయాడ్స్ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలెజిన్స్ (ఏఐ) సాంకేతికతను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ సాంకేతికత మంచి సామర్థ్యంతో పని చేయడం, ఉద్యోగుల అవసరం తగ్గడంతో గూగుల్ లాభాల మార్జిన్లు కూడా పెరుగుతున్నాయి. 
 
గూగుల్ ఏఐ వినియోగం పెరిగే కొద్ద ఉద్యోగాల్లో కోతలు మెదలువుతున్నాయని ది ఇన్ఫర్మేషన్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం గూగుల్ వినియోగిస్తున్న పర్ఫార్మెన్స్ మ్యాక్స్ యాడ్ టూల్ ప్రకటనల రూపకల్పన, ప్లేస్‌మెంట్ వంటి విషయాల్లో అడ్వటైజర్లకు సహకరిస్తుంది. అనేక విషయాల్లో స్వతంత్ర నిర్ణయాలు తీసుకనే స్థాయికి చేరుకుంది. అప్పటికప్పుడు రియల్ టైంలో యాడ్లలో మార్పులు చేస్తూ ప్రకటనల ప్రభావశీలతను ఈ టెక్నాలజీని పెంచుతుంది. ఫలితంగా ఉద్యోగుల అవసరం తగ్గుతుండటంతో లేఆఫ్స్ భయాలు మొదలయ్యాయి.