గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు వచ్చే అవకాశం ఉంది. అలాగే. కొత్త సంవత్సరం తొలి నెల జనవరిలో ఇతర సెలవులు కూడా బాగానే ఉన్నాయి. సంక్రాంతితో పాటు ఇతర సెలవుల వివరాలను పరిశీలిస్తే, 
 
జనవరి 13వ తేదీన రెండో శనివారం సెలవు. 14వ తేదీన భోగి పండుగ, పైగా ఆదివారం. 15వ తేదీన సంక్రాంతి. సాధారణ సెలవు ఇచ్చారు. అలాగే, 16వ తేదీన ఆప్షనల్ హాలిడే ఇచ్చారు. వీటితో పాటు విద్యా సంస్థలకు అదనంగా మరో రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. దీంతో స్కూల్స్, కాలేజీలకు మాత్రం ఆరు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు సెలవులు వస్తాయి. 
 
ఇదిలావుంటే, జనవరి నెలలో మరో నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగు శనివారాల సెలవులతో సంక్రాంతి సెలవులు, జనవరి ఒకటో తేదీ కొత్త సంవత్సరాది, 26వ తేదీ రిపబ్లిక్ డే వంటి సెలవులు కూడా ఉన్నాయి. దీంతో కొత్త సంవత్సరం 2024లో తొలి నెలలోనే అధిక సెలవులు వచ్చాయి.