45 పాఠశాలలకు ఇ-మెయిల్ బాంబు బెదిరింపులు
బెంగళూరు నగరంలో 45 పాఠశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళనలు అలుముకున్నాయి. ఫలితంగా వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు ఇతర సిబ్బంది పాఠశాల ప్రాంగణం నుండి వేరే ప్రాంతాలకు తరలించబడ్డారు.
బెంగళూరులోని యెమలూరులోని ఎన్‌ఈఈవీ అకాడమీకి బాంబు బెదిరింపు వచ్చిన పాఠశాలల్లో ఒకటి. పాఠశాల తల్లిదండ్రుల వాట్సాప్ గ్రూప్‌లో బెదిరింపులు రావడంతో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తం అయ్యారు. వారి వారి పిల్లలను సురక్షితంగా ఇంటికి తెచ్చుకున్నారు.