1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (10:45 IST)

బెంగళూరులో మహిళకు రాత్రి వేళ వేధింపులు... భర్త ఆవేదన

Woman
Woman
బెంగళూరులో మహిళకు రాత్రి వేళ వేధింపులకు గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తన భార్య ఎదుర్కొన్న ఘటనకు సంబంధించిన వివరాలను ఆమె భర్త షేర్ చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కన్నడిగుడినైనా తాను కూడా రాత్రి పది గంటల దాటాక కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నానంటూ అతడు తన ఆవేదన పంచుకున్నాడు. అతడి భార్య నవంబర్ 8న రాత్రి తన కోలీగ్స్‌ను ఇంటి వద్ద దింపేందుకు కారులో బయల్దేరింది. 
 
సర్జాపూర్ ప్రాంతంలో కొందరు టెంపోతో మహిళ కారును కావాలని ఢీకొట్టారు. ఆ తర్వాత ఆమెను కొన్ని కిలోమీటర్ల పాటు వెంబడించారు. కారు దిగమంటూ బలవంతం చేశారు. 
 
కారులోని వారికి కన్నడ రాదని తెలిసి యాక్సిడెంట్ పేరుతో బ్లాక్‌మెయిలింగ్‌కు ప్రయత్నించారు. కానీ మహిళ మాత్రం వారి ఆటలు సాగనీయలేదు. 
 
కారును మెయిన్ రోడ్డు పక్కన ఆపేసింది. కారు దిగమని వారు బెదిరిస్తున్నా లెక్కచేయకుండా పోలీసులకు, తన స్నేహితులకు ఫోన్ చేసింది. వారందరూ అక్కడికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని మహిళ భర్త వాపోయాడు. 
 
ఇలాంటి ఘటనలకు షర్జాపూర్ హాట్‌స్పాట్‌గా మారిందని, దీనికి పరిష్కారం కనిపెట్టాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ పోస్ట్‌పై నెట్టింట భారీగా స్పందన వస్తోంది.