సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (17:21 IST)

ఇంటి వరండాలో కొండచిలువ.. కెవ్వును అరిచిన మహిళ

కొండచిలువ ఇంటి వరండాలో కనిపించింది. అంతే ఆ ఇంటి యజమాని షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ ఇంటి నుంచి వరండాలో భారీ కొండచిలువ దర్శనమివ్వడంతో కెవ్వున అరిచింది. 
 
ఇంటి లోపలకు పరుగెత్తిన మహిళ సమాచారం అందించడంతో స్నేక్ క్యాచర్లు దాన్ని పట్టుకొని తీసుకువెళ్లి అడవిలో వదిలి వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కొండచిలువ పైకప్పుపై ఉండగా దాన్ని ఒక వ్యక్తి మెల్లగా కొండచిలువ దగ్గరికి వచ్చి, ఒక రాడ్ ఉపయోగించి దాన్ని కిందకు దించారు. ఒకసారి కొండ చిలువను పట్టుకుని దాన్ని సంచిలో పెట్టుకుని అడవిలో వదిలేశారు.