సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (12:48 IST)

నిద్రిస్తున్న మామను సజీవంగా దహనం చేసేందుకు కోడలి యత్నం.. ఎక్కడ?

woman sets fire
పడక గదిలో మంచానికే పరిమితమైన మామను సజీవంగా దహనం చేసేందుకు ఓ ఇంటి కోడలు ప్రయత్నించింది. పేపర్‌ను కాల్చి ఆయన పడుకునివున్న పడక గదిలో వేసింది. దీంతో బెడ్‌పై దుప్పట్లకు మంటలు అంటుకోవడంతో ఆ వృద్ధుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన తండ్రిని సజీవంగా దహనం చేసేందుకే తన భార్య ఈ దారుణానికి పాల్పడిందని భర్త ఆరోపిస్తున్నారు. 
 
ఈ వీడియోలోని వివరాలను పరిశీలిస్తే, సదరు మహిళ ఆ వృద్ధుడికి కోడలుగా తెలుస్తుంది. వారి ఇంట్లో ఏం జరిగిందో తెలియదుగానీ, పడక గదిలో మంచానికే పరిమితమైవున్న మామను సజీవంగా దహనం చేయాలని భావించింది. ఇందుకోసం ఆమె ఓ పేపర్‌ను కాల్చి పడక గదిలో పడేసింది. బట్టలకు మంటలు అంటుకుని ఎగిసిపడితే ఆ మంటల్లో సజీహదహనమైపోతాడని భావించింది. 
 
కానీ, తన భార్య ప్రవర్తనను అనుమానించిన ఆమె భర్త... ఆమె చేసిన పనిని ఫోనులో రికార్డు చేశాడు. అంతేకాకుండా ఆ మంటలు పడక గదికి అంటుకోకుండా పేపర్‌ను పక్కకు తోసేశాడు. తన తండ్రిని చంపేయాలని తన భార్య ప్రయత్నిస్తోందని అన్నాడు. ఈ హడావిడికి నిద్రలో నుంచి మేల్కొన్న వృద్ధుడు.. తన బెడ్‌పై మంటలు చూసి షాక్‌కు లోనయ్యాడు. అయితే, ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే విషయం తెలియరాలేదు.