శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 నవంబరు 2023 (11:56 IST)

వివాదంలో చిక్కుకున్న ఏపీ మంత్రి రోజా

rk roja
ఏపీ మంత్రి రోజా వివాదంలో చిక్కుకున్నారు. రోజా వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ స్టెయిన్ అన్యమత గుర్తులు వున్న గొలుసులతో తిరుమల వద్ద గొల్లమండపం కనిపించాడు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
తిరుమలలో అన్యమత గుర్తులపై నిషేధం ఉంది. అలిపిరి టోల్‌గేట్ వద్దే భక్తులను తనిఖీ చేసి కొండపైకి పంపుతారు.

అయితే, స్టెయిన్ మాత్రం నేరుగా అన్యమత గుర్తు ఉన్న చెయిన్ ధరించి తిరుమల వచ్చాడు. ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ఎక్కి ప్రదర్శన చేశాడు. ఇది చూసిన భక్తులు విస్తుపోయారు.