శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (10:05 IST)

మందుబాబులు మద్యం తాగుతామంటే మేమేం చేస్తాం : ఏపీ మంత్రి బొత్స

botsa
ఏపీలోని మందుబాబులు మద్యం తాగుతామంటే తామేం చేస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మందుబాబులను మద్యానికి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నామని.. అయినా వారు తాగుతామంటే తామేం చేయగలమని చెప్పారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యం కుంభకోణం జరిగిందని, దానిపై దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని విలేకర్లు ప్రస్తావించారు. నిర్భయంగా దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. 
 
టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టోలు తీసుకొచ్చినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. 'అప్పులు చేసి.. ఆ నిధులను అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నాం. రాష్ట్రంలో అందరికీ న్యాయం చేశాం. ఈ నాలుగున్నరేళ్లలో ఎంతో చేశాం. వచ్చే ఎన్నికల్లో మాకు ఎందుకు ఓటేయరని ప్రజలను అడుగుతాం అని బొత్స పేర్కొన్నారు. 
 
ఇకపోతే, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని న్యాయస్థానాలు నమ్మాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అవినీతి జరిగిందని తామూ నమ్ముతున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాత నిజాలు బయటపడతాయన్నారు.