బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (17:46 IST)

రహస్యంగా పెళ్లి.. బిడ్డతో వస్తానంటే బెదిరింపులు.. ఆపై కత్తిపోట్లు

knife
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ప్రేమ వ్యవహారంతో కత్తిపోట్లు కలకలం రేపాయి. ప్రేమ వ్యవహారంపై మహిళా ఉద్యోగి ఒకరు మరో అధికారిపై కత్తితో దాడిచేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్.శిల్ప 2018 నుంచి ఆత్మకూరు ఏవోగా పనిచేస్తున్నారు. 
 
అదే మండలంలోని పల్లపహాడ్ వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)గా మనోజ్ పనిచేస్తున్నారు. శిల్పకు 2012లో వివాహం జరగ్గా రెండున్నరేళ్ల బాబు కూడా ఉన్నాడు. వీరిద్దరి మధ్య రెండున్నరేళల పాటు ప్రేమ వ్యవహారం నడుస్తోంది. 
 
ఈ విషయం మనోజ్ ఫ్యామిలీకి తెలియరావడంతో అతడిని మందలించడం జరిగింది. అప్పటి నుంచి అతడు ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. రెండు నెలలు సెలవు పెట్టారు. 
 
తిరిగి విధులకు హాజరైన అతని వద్ద కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి వచ్చారు. అతడితో మాట్లాడేందుకు శిల్ప ప్రయత్నించగా అది వాగ్వివాదానికి దారితీసింది. ఘర్షణ జరుగుతుండగానే శిల్ప అకస్మాత్తుగా కత్తితీసి అతడిపై దాడిచేసింది. మెడ, వీపు భాగాలపై గాయాలు కావడంతో మనోజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై శిల్ప మాట్లాడుతూ.. మనోజ్‌తో తాను రిలేషన్‌లో ఉన్నానని, నిరుడు జూన్ 7న ఇద్దరం రహస్యంగా వివాహం కూడా చేసుకున్నామని చెప్పింది. భర్తకు విడాకులిచ్చి తనతోనే ఉండాలని మనోజ్ ఒత్తిడి చేశాడని, బాబును కూడా తీసుకొస్తానంటే చంపేస్తానని బెదిరించాడని శిల్ప ఆరోపించింది. 
 
తొలుత మనోజ్ తనపై కత్తితో దాడిచేస్తే ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశానని చెప్పింది. శిల్పపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.