శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 నవంబరు 2023 (16:27 IST)

హెచ్ఐవీ వైరస్ కలిగిన మహిళకు ఆపరేషన్.. ఆందోళనలో వైద్య సిబ్బంది

hiv-aids
హెచ్ఐవీ వైరస్ కలిగిన మహిళకు వైద్య సిబ్బంది ఆపరేషన్ చేశారు. హెచ్ఐవి విషయాన్ని వైద్య సిబ్బందికి చెప్పకుండా సి-సెక్షన్ డెలివరీ చేయించుకుంది. ఈ విషయం తెలియరావడంతో ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది సర్జికల్ ఓటీ సీలు చేశారు. 
 
ఆపరేషన్ థియేటర్‌కు తాళం వేసి డాక్టర్‌తోపాటు సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. 
 
నవంబర్ 4న గర్భిణికి శస్త్రచికిత్స జరిగింది. కానీ గురువారం, ఆ మహిళ తనకు గల హెచ్ఐవీ సంక్రమణ గురించి సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.