సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:32 IST)

ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ డే.. పాముకాటుతో 21 ఏళ్ల యువకుడి మృతి

Snake
త్రిసూర్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత పాము కాటుతో మరణించాడు. కర్ణాటకలోని తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీ విద్యార్థి ఆదిత్ బాలకృష్ణన్ పాముకాటు గురై మృతి చెందాడు.
 
బెంగళూరుకు 80 కిలోమీటర్ల దూరంలోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో స్నాతకోత్సవానికి హాజరైన ఆయన తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
పార్కింగ్‌లో బాలకృష్ణన్ పాము కాటుకు గురై వుంటాడని అనుమానిస్తున్నారు. అయితే పాము కాటుకు గురైందని గుర్తించకపోవడంతో తన నివాసానికి వెళ్లాడు. ఆదిత్ తల్లి, ఇతర బంధువులు కూడా స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 
 
నివాసానికి చేరుకున్న ఆదిత్ బాత్‌రూమ్‌లోకి ప్రవేశించగా, తలుపు తెరవకపోవడంతో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. ఆస్పత్రిలో పరీక్ష చేయగా కాలుపై పాము కాటు వేసిన గుర్తు కనిపించింది. 
 
పోస్ట్ మార్టం పరీక్షలో రక్తంలో పాము విషం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎంపీ శశిథరూర్ ఆదిత్  స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.