1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Class 12 student thrashed, urinated upon in Uttar Pradesh

బాలుడిని బందీ చేశారు.. ఆపై ముఖంపై మూత్ర విసర్జన

crime scene
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్తున్న బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసి బందీ చేశారు. అనంతరం జాగృతి విహార్‌లోని నిర్జన రహదారిపైకి తీసుకెళ్లి దాడి చేశారు. 
 
అంతటితో ఆగని నిందితులు ఆ బాలుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు. మరోవైపు ఆ బాలుడు అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టారు. 
 
మరుసటి రోజు ఉదయం ఎలాగోలా ఆ బాలుడు వారి నుంచి తప్పించుకుని ఇంటికి  వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది. 
 
వీడియో బయటకు వచ్చిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపులు చేపట్టారు.
 
ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పట్టలేనంతగా పెరిగిన పసిడి ధరలు.. 55వేలు దాటిందిగా!