బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (09:53 IST)

నాలుగో తరగతి చిన్నారిపై కాంపాస్‌తో 108 సార్లు పొడిచిన సహ విద్యార్థులు...

compass
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ నగరంలో దారుణం జరిగింది. నాలుగో తరగతి చదివే చిన్నారిపై సహ విద్యార్థులు జామెట్రీ బాక్స్‌లోని కాంపాస్‌తో 108 సార్లు పొడిచాడు. ఇండోర్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌కు చెప్పేందుకు భయపడిన బాధిత విద్యార్థి.. ఇంటికొచ్చాక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఇండోర్ నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఆరాధ్య పాండే అనే నాలుగో తరగతి విద్యార్థిపై ముగ్గురు తోటి విద్యార్థులు దాడి చేశారు. జామెట్రీ కంపాస్‌తో ఏకంగా 108 సార్లు పొడిచారు. ఈ చిన్నారుల మధ్య జరిగిన అనూహ్యం ఘటనతో ఈ ఘటన జరిగింది. ఈ నెల 24వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనిపై ఎయిర్‌డ్రోమ్ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
ఈ ఘటనను ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరాధ్య పాండే తండ్రి ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజీ కోరినా ఇవ్వలేదని పేర్కొన్నారు. చిరవరకు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మధ్య చిన్న గొడవి అనూహ్యంగా ఈ దాడికి కారణమైనందని తెలుస్తుంది. కాగా, బాలుడికి వైద్య పరీక్షలు జరిగాయని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. విద్యార్థులందరూ పదేళ్ల లోపు వారేనని, చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 
 
మరోవైపు, ఈ ఉదంతంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కూడా దృష్టి సారించింది. త్వరలో పిల్లలు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. వీడియో గేమ్స్‌‌లోని హింసాత్మక దృశ్యాల ప్రభావం పిల్లలపై పడిందా? అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని వెల్లడించింది.