ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:15 IST)

నిఖిల్ సిద్దార్థ్ తన భార్య పల్లవి శ్రీమంతం గురించి అప్ డేట్ ఇచ్చాడు

Nikhil Siddharth, wife Pallavi Srimantham
Nikhil Siddharth, wife Pallavi Srimantham
కార్తికేయ ౨ హీరో నిఖిల్ సిద్దార్థ్ తన భార్య పల్లవి శ్రీమంతం గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఆనందం మాటల్లో చెప్పలేను. ఈ మనోహరమైన జంటకు మాతృత్వంలోకి సాఫీగా, సంతోషకరమైన ప్రయాణం జరగాలని కోరుకుంటున్నాను అంటూ వెల్లడించారు.
 
జనవరి 31న, నిఖిల్ సిద్ధార్థ తన భార్య పల్లవి శర్మ గర్భం దాల్చినట్లు ఆమె బేబీ షవర్ ఫోటోతో ప్రకటించారు. ఫోటోను షేర్ చేస్తూ, "సీమంతం .. బేబీషోవర్ యొక్క సాంప్రదాయ భారతీయ రూపం.. మా మొదటి బిడ్డ అతి త్వరలో వస్తుందని పల్లవి & నేను సంతోషిస్తున్నాము.. దయచేసి మీ ఆశీస్సులు పంపండి" అని రాశారు.
 నిఖిల్ సిద్ధార్థ తన స్నేహితురాలు పల్లవి శర్మను 2020 లో లాక్‌డౌన్ వివాహంలో వివాహం చేసుకున్నాడు.