ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 మార్చి 2024 (11:03 IST)

హీరో నిఖిల్ ప్రారంభించిన ఎఫ్‌ఎన్‌సిసి 12వ ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్

nikhil siddarth
ఎఫ్‌ఎన్‌సిసి నిర్వహించే 12 ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ ఆదివారం హీరో నిఖిల్ చేతుల మీదుగా ప్రారంభమైంది. సౌత్ ఇండియా‌లోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్‌లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్‌ఎన్‌సిసి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్, ఎఫ్‌ఎన్‌సిసి వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు, ఏడిద సతీష్ (రాజా), మాజీ క్రికెటర్, ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ చాముండేశ్వరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
 
ఎఫ్‌ఎన్‌సి‌సి వైస్ ప్రెసిడెంట్ రంగారావు మాట్లాడుతూ... ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మన ముఖ్యఅతిథి హీరో నిఖిల్‌ని టోర్నమెంట్ ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు. 
 
హీరో నిఖిల్ మాట్లాడుతూ... ముందుగా నన్ను ఈవెంట్‌‌కి పిలిచినందుకు ముళ్లపూడి మోహన్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక యాక్టర్‌ని కానీ ఇలా ఈవెంట్‌కి వచ్చి స్పోర్ట్స్‌మెన్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి నటునలను ఇలాంటి ఫంక్షన్స్‌కి పిలిచి స్పోర్ట్స్‌మెన్స్‌తో కలిపి మాకు కూడా ఒక మైండ్ రిఫ్రిషింగ్ ఈవెంట్ లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్ సిల్వర్ మెడల్స్ గెలిచిన ఆటగాళ్లని కలవడం వాళ్ళని సత్కరించడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి టోర్నమెంట్ ద్వారా ఆడుతున్న టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడున్న యువత ఈ బ్రిడ్జ్ టోర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
 
ఎఫ్‌ఎన్‌సిసి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ మాట్లాడుతూ... ఎంతో బిజీగా ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వచ్చిన హీరో నిఖిల్‌కి మా ఎఫ్‌ఎన్‌సిసి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనంగా ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసి ఏర్పాట్లు చేసినందుకు రమణమూర్తికి ధన్యవాదాలు. బ్రిడ్జ్ టోర్నమెంట్‌ని స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ విశ్వేశ్వర్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము అందరి సపోర్ట్ తో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అన్నారు.