జీరో కరెంట్ బిల్లు కావాలంటే ఆ పని చేయండి: డిప్యూటీ సిఎం భట్టి
కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం విజయవంతంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 మందికి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నాం.
కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఈ తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. ప్రజాపాలనలో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్‌ను సరిగ్గా పొందుపరిచి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఈ నెల జీరో బిల్లు వచ్చిందని చెప్పారు.
దరఖాస్తులో పొరపాటున తప్పులు పడిన వారు వెంటనే ఎంపిడివో కార్యాలయానికి వెళ్లి అక్కడ ఉన్న ప్రజపాలన అధికారికి తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయిన తరువాత జీరో బిల్లు వస్తుంది.'' అని చెప్పారు.