కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా: ఇక మిగిలింది ఒక్కరే
పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న ప్రస్తుత తరుణంలో హఠాత్తుగా కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ఎందుకు రాజీనామా చేసారన్నది తెలియాల్సి వుంది. కాగా ఈయన పదవీకాలం 2027 వరకూ వున్నది. ఐతే మూడేళ్లు ముందుగానే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత కారణాల వల్ల పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
అరుణ్ గోయల్ 1985 పంజాబ్ కేడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. 2022లో ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమితులయ్యారు. ఇదిలావుండగా ముగ్గురు సభ్యుల ప్యానెల్ లోని అనుప్ పాండే గత ఫిబ్రవరిలో పదవీ విరమణ చేసారు. తాజాగా అరుణ్ రాజీనామా చేసారు. ఇక మిగిలింది సీఈసిగా వున్న రాజీవ్ కుమార్ ఒక్కరే. ఈ నేపధ్యంలో ఖాళీగా వున్న రెండు పోస్టులను ఎపుడు భర్తీ చేస్తారన్నది చూడాల్సి వుంది.