గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:16 IST)

శ్రీవారి నడకదారిలో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్

Samyukta
సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమలలో సందడి చేసింది. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. సంయుక్తా మీనన్ మెట్లు ఎక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ భామ నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో గోల్డెన్ బ్యూటీ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని నడకమార్గంలో వెళ్లి దర్శించుకున్న సందర్భంగా ఆ మార్గంలోని భక్తులు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
వారితో ఫోటోలు దిగిన సంయుక్త మీనన్.. ఆపై మెట్లను నమస్కరించుకుంటూ తిరుమల చేరింది. ఆపై శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.