ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (12:42 IST)

సెప్టెంబర్ నుంచి అఖండ 2 షూటింగ్ ప్రారంభం

akhanda movie still
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి మూడు సార్లు కలిసి పనిచేశారు. వీరి కాంబోలో మూడవ ప్రాజెక్ట్, "అఖండ" వారి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అఖండ 2 జూన్‌లో అధికారికంగా ప్రారంభించబడనుంది.
 
అయితే రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.
 
బాలకృష్ణ సినిమాకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిలిపివేసి ఇప్పుడు తన తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు. హిందూపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మూడోసారి కూడా గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నారు.
 
ఎన్నికల తర్వాత, అతను బాబీ దర్శకత్వం వహించిన #NBK109 పనిని తిరిగి ప్రారంభిస్తారు. ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు.