శ్రీవారి సేవలో పాల్గొన్న 'జవాన్' - వెంట నయనతార కూడా..
బాలీవుడ్ అగ్రనటుడు షారూక్ ఖాన్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తన భార్య, కుమార్తెతో కలిసి మంగళవారం శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు షారూక్‌కు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 7వ తేదీన "జవాన్" విడుదల కానుండటంతో తిరుమలకు వచ్చిన ఆయన... స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో షారూక్ దంపతులతో 'జవాన్' చిత్ర హీరోయిన్ నయనతార కూడా ఉన్నారు.
షారూఖ్ ఖాన్, భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి వచ్చిన ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. ఆ తర్వాత షారూక్ గర్భాలయంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు పండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. కోలీవుడ్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తాను హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటించిన "జవాన్" చిత్రం ఈ నెల 7వ తేదీన విడుదలకానుంది.