గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (12:41 IST)

లండన్ పర్యటనకు సీఎం జగన్ దంపతులు.. కుమార్తెల కోసం..

Jagan_Bharathi
Jagan_Bharathi
ఏపీ సీఎం జగన్ దంపతులు శనివారం లండన్ పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 11వ తేదీ రాత్రికి వారు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  అక్కడ చదువుకుంటున్న తన కుమార్తెలను కలిసేందుకు జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి లండన్ వెళ్తున్నారు. 
 
సీఎం జగన్‌పై ఉన్న కేసుల దృష్ట్యా.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు వీలుగా బెయిల్ నిబంధనలన సడలించాలనీ సీఎం జగన్ హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిని పక్కన పెడుతూ సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి  ఇచ్చింది. 
 
దీంతో సీఎం జగన్ దంపతులు లండన్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. ఇకపోతే.. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు అర్పించారు. 
 
అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. అనంతరం ఈ రోజు రాత్రి 9.30 గంటలకు సీఎం జగన్ దంపతులు లండన్ బయలుదేరి వెళ్లనున్నారు.