బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (12:42 IST)

లండన్ వీధుల్లో రిలాక్స్ మోడ్‌లో మాస్ మహారాజా చిల్లింగ్

Raviteja- london
Raviteja- london
మాస్ మహారాజా రవితేజ షూటింగ్ విరామంలో సరదాగా రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు. ఈ ఫోటోలను పోస్ట్ చేసి ఛిల్ల్ అంటూ ఫాన్స్ ను ఫిదా చేశారు. ఈరోజు షూటింగ్  విరామం దొరకడంతో ఇలా బయటకు వచ్చి విండో షాపింగ్ చేస్తున్నట్లు  పోజ్ పెట్టాడు. 'ధమాకా'  విజయం తర్వాత రెండవసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో  'ఈగల్' చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన సినిమా టైటిల్‌ గ్లింప్స్ మంచి అంచనాలను నెలకొల్పింది.
 
Raviteja- london
Raviteja- london
'ఈగల్' కొత్త షెడ్యూల్ ఇటీవలే లండన్ లో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్‌ లో రవితేజ, ఇతర ప్రముఖ తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక. నవదీప్, మధుబాల ఇతర ముఖ్య తారాగణం.
 
ఈ హైబడ్జెట్ ఎంటర్‌టైనర్ కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.మణిబాబు కరణం డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ కూడా. దవ్‌జాంద్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగల ప్రొడక్షన్ డిజైనర్.
'ఈగల్' 2024 సంక్రాంతికి విడుదల కానుంది