ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (17:27 IST)

టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర షురూ అయింది

Tiger Nageswara Rao
Tiger Nageswara Rao
రవితేజ తన తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంశీ దర్శకత్వంలో చేస్తున్నారు.  ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్,  అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్-ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 తర్వాత బ్యానర్ నుండి వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు  ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  
 
ఇప్పుడు టైగర్ దండయాత్ర  మొదలుకాబోతుంది. ఆగస్ట్ 17న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు రాకకు చిహ్నంగా టీజర్ పోస్టర్‌లో బిగ్ యాక్షన్‌లోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది.
 
దర్శకుడు వంశీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు, తనకి నిర్మాతల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది రవితేజకు హయ్యెస్ట్  బడ్జెట్‌ మూవీ. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున, మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.