1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nani Starrer Dasara 100 Days Received Shields

నాని నటించిన దసరా 100 డేస్ షీల్డ్స్ అందుకుంది

Nani, Srikanth Odela, Anil Sunkara, Naga Vamsi
Nani, Srikanth Odela, Anil Sunkara, Naga Vamsi
నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి సక్సెస్ ఫుల్ గా 100 రోజులని పూర్తి చేసుకుంది.
 
ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి మేకర్స్ చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, సాహుగారపాటి, గోపి అచంట హాజరయ్యారు.
 
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణ్ సెన్సేషనల్ ఆల్బమ్ అందించారు.
తర్వాతి కథనం
ఇలా చిరంజీవి కూర్చున్న స్థానంలో పవన్‌ కళ్యాణ్‌ వుంటే ఎలా వుండేది!