శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (09:35 IST)

నేడు రైతులకు పెట్టుబడి సాయం - బటన్ నొక్కనున్న సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులను జమచేయనుంది. తాజా సీజన్ కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మొదటి విడత పెట్టుబడి సాయం కింద ఈ నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రూ.109.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
నిజానికి ఈ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన జరగాల్సివుంది. కానీ, ఆర్థిక శాఖ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ - వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు రైతులకు ఏటా రూ.7500 పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. 
 
ఇది మూడు విడతల్లో అందజేస్తున్న విషయం తెల్సిందే. 2023-24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడత సాయాన్ని నేడు అందించనున్నారు. ఇందుకోసం రూ.109.74 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.