1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (19:11 IST)

కవల పిల్లలతో కలిసి వీడియో రిలీజ్ చేసిన నయనతార.. ఇన్‌స్టాలో..

Nayanatara
Nayanatara
దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార.. రజనీ, విజయ్, సూర్య వంటి ఎందరో అగ్ర నటులతో నటిస్తూ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగొందుతోంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ వంటి పలు భాషా చిత్రాలలో కూడా ఆమె నటించింది. నయన తాజాగా నటించిన 'జవాన్' సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. 
 
గత జూన్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకున్నారు. అద్దె తల్లి ద్వారా వారికి కవల మగపిల్లలు కలిగారు. తన పిల్లలను నిరంతరం చూసుకునే నయనతార సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రమే తమ ఆనంద క్షణాలను తన సోషల్ మీడియాలో పంచుకునేవారు. 
 
ఈ నేపథ్యంలో నయనతార ఇప్పుడు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించింది. మొదటి సారి, నయన ఆమె పిల్లలు రుద్రో నీల్, ఉలాగ్ దేవక్‌లతో కలిసి ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.