మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2023 (12:41 IST)

అమెరికాలోని అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్ టీం హైదరాబాద్ వచ్చి అప్డేట్ ఇచ్చారు

sukumar-arjun
sukumar-arjun
జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రాంతీయ సరిహద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించారు.  గంగోత్రి నుండి పుష్ప వరకు తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. 'పుష్ప: ది' రైజ్ చిత్రంతో వరల్డ్ వైడ్ గా గుర్తింపును అందుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అల్లు అర్జున్ తో  ఇన్‌స్టాగ్రామ్‌ చేసిన ఓ స్పెషల్వీ డియో అదుర్స్ అనిపించేలా ఉంది. ఒక రోజంతా ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఈ ఐకాన్ స్టార్ తోనే ఉంది. 
 
sukumar-arjun
sukumar-arjun
ఫస్ట్ టైం అమెరికాలో ఉన్న ఇన్స్టాగ్రామ్ టీం స్వయంగా హైదరాబాద్ వచ్చి ఓ రోజంతా అల్లు అర్జున్ గారితో గడపడం విశేషం .
ఈ వీడియోలు బన్నీ  దినచర్యను వీరు చూపించారు. ఉదయం లేచినప్పటి నుంచీ షూటింగ్ ముగిసే వరకూ తాను ఏయే పనులు చేస్తారో ఆ వీడియోలో వివరించారు.

sukumar-arjun
sukumar-arjun
సెట్స్ లోకి తీసుకెళ్లే ముందు తన ఇంట్లోనూ అర్జున్ ఓ టూర్ వేసి చూపించారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న పుష్ప 2 షూటింగ్ కు తీసుకెళ్లడంతోపాటు అక్కడ మూవీ కోసం వేసిన సెట్స్, తన కాస్ట్యూమ్స్, డైరెక్టర్ సుకుమార్, మూవీ షూటింగ్.. ఇలా ఈ వీడియోలో  చూపించారు.
"పుష్ప 2" సెట్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ ఉదయాన్నే కాస్త చిల్ అవుతారు" అంటూ ఈ వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేసింది. అంతేకాదు ఈ వీడియోలో బన్నీ చేసిన కామెంట్స్ ను కూడా క్యాప్షన్ రూపంలో చెప్పింది. "ఇండియాలో అభిమానులు చాలా భిన్నం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటిది కనిపించదు. మీరు చూడాల్సిందే. దీనిని వర్ణించలేం" అంటూ చెప్పడం అల్లు అర్జున్ గ్లోబల్ లెవెల్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతున్నారు అర్థమవుతుంది.
 
"హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఇది. ప్రపంచంలోని అతిపెద్ద స్టూడియోల్లో ఇదీ ఒకటి. పుష్ప 2: ది రూల్ షూటింగ్ ఇక్కడే జరుగుతుంది" అని ఫిల్మ్ సిటీ గురించి బన్నీ వివరించారు. అభిమానులే తనకు మోటివేషన్ అని, వాళ్ల ప్రేమే తాను తన సరిహద్దులను చెరిపేస్తూ ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తోందని అన్నారు.