గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (18:16 IST)

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రీలీల

Sreeleela
Sreeleela
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
 
పెళ్లి సందడితో టాలీవుడ్​లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమా తరువాత వెంకన్న దర్శనానికి మళ్లీ ఇప్పుడే వచ్చానని ఆమె తెలిపారు. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ దక్కించుకున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే.