సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (12:48 IST)

బాలయ్య తన సొంత బాబాయ్‌లా అనిపించారు : శ్రీలీల

sree leela
తెలుగు చిత్రపరిశ్రమలో యువ హీరోయిన్ శ్రీలీల హవా కొనసాగుతుంది. చిన్న వయసులోనే ఇంట యంగ్ హీరోలు, అటు పెద్ద హీరోల చిత్రాల్లో నటించే అవకాశాన్ని దొరకపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. యువరత్న బాలకృష్ణ నటించే భగవంత్ కేసరి చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీల బాబాయ్, కూతుళ్లుగా నటించారు. చిత్రం నుంచి ఇటీవల విడుదలైన తొలి పాటలో ఇద్దరూ తమ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. వీరి డ్యాన్స్‌కు అభిమానుల ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో 'భగవంత్ కేసరి' విశేషాలు, బాలయ్యతో తెర పంచుకున్న అనుభవాలను శ్రీలీల తాజాగా వెల్లడించారు.
 
బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సినిమా చేస్తున్నంతసేపు ఆయన తనకు సొంత బాబాయ్లాగే అనిపించారని చెప్పింది. సెట్‌లో బాలయ్య సైతం తనను అలాగే చూసుకున్నారని చెప్పింది. మరో అవకాశం వస్తే మళ్లీ బాలయ్యతో నటించాలని ఉన్నట్టు తెలిపింది. ఇక, సెట్లో సాటి నటులకు బాలకృష్ణ ఇచ్చే గౌరవం చూసి తాను ఫిదా అయిపోయానని చెప్పింది.