గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (20:23 IST)

నాకే సవాల్ విసురుతున్న హీరో రామ్ : హీరో బాలకృష్ణ

balakrishna
హీరో రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషనల్‌లో వస్తున్న చిత్ర స్కంద. శ్రీలీల హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్కీన్ బ్యానరుపై నిర్మించారు. వచ్చే నెల 15వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించారు.
 
ఇందులో బాలయ్య ప్రసంగిస్తూ, రామ్ జర్నీని నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడానికి ట్రై చేస్తూ వస్తున్నాడు. తెలంగాణ నేపథ్యంలో ఆయన ఈ సినిమా చేసి, 'భగవంత్ కేసరి'లో నా పాత్రపై సవాల్ విరుతున్నాడు అని అన్నారు. 
 
ఇక శ్రీలీల విషయానికి వస్తే అందం.. అభినయం.. నాట్యం అన్నీ తెలిసిన అమ్మాయి. నేను తనతో చేస్తున్నాను. వరుసగా ఎన్నో సినిమాలు చేస్తున్నా, తనలో అలసటను నేను చూడలేదు. ఎప్పుడు చూసినా ఎంతో హుషారుగా ఉంటుంది. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
బోయపాటి అంకితభావాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇద్దరం కూడా గతంలో చేసిన సినిమాల గురించి కాకుండా చేయబోయే సినిమాలను గురించి ఆలోచన చేస్తూ ఉంటాము. ఈ సినిమాతో ఆయన మరో హిట్‌ను ఇవ్వడం ఖాయమనే నాకు అనిపిస్తోంది అని బాలయ్య బాబు అన్నారు.