సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2023 (09:20 IST)

గట్టిగా అరిస్తే తొయ్యాలే .. అడ్డమొస్తే లేపాలే'... "స్కంద" ట్రైలర్ రిలీజ్

skanda trailer
హీరో రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషనల్‌లో వస్తున్న చిత్ర స్కంద. శ్రీలీల హీరోయిన్. శ్రీనివాస సిల్వర్ స్కీన్ బ్యానరుపై నిర్మించారు. వచ్చే నెల 15వ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ముఖ్య అతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించారు.
 
ఈ వేదికపై నుంచి సీనియర్ నటుడు బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే', 'దెబ్బ తాకితే సౌండ్ గోల్కొండ దాటాలా.. శాల్తీ శాలిబండ చేరాలా', వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీన్స్‌పై ఈ ట్రైలర్‌ను కట్
చేశారు.
 
కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఎమోషన్స్‌కి కూడా ట్రైలర్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. శ్రీలీల కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో, శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, దగ్గుబాటి రాజా ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. థమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు.