1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2023 (15:55 IST)

రామ్ పోతినేని, శ్రీలీల స్కంద లేటెస్ట్ అప్డేట్

Ram Pothineni, Srileela
Ram Pothineni, Srileela
బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో దిట్ట.  కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తన సినిమాల్లో తగిన వినోదం, ఫ్యామిలీ డ్రామా ఉండేలా చూసుకుంటారు. బోయపాటి ‘స్కంద’ కోసం ఎనర్జిటిక్ & మాస్ ఉస్తాద్ రామ్ పోతినేనితో చేతులు కలిపారు. రాపో  హై-ఆక్టేన్ ఎనర్జీ, ఉబర్ స్టయిల్ కి చిరునామా. రామ్ ‘స్కంద’ కోసం అన్ బిలివబుల్ గా మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రాపో డిఫరెంట్  షేడ్స్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్స్ లో అల్ట్రా మాస్‌తో పాటు క్లాస్‌ లుక్స్‌లోనూ అదరగొట్టారు. కండలుతిరిగిన శరీరంతో పవర్ ఫుల్ లుక్  లో ఎక్స్ టార్డినరిగా కనిపించారు. ఈ కాంబో & కంటెంట్ ‘స్కంద’ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని సమానంగా అలరిస్తుందని సూచిస్తోంది.  
 
ఇప్పుడు, మేకర్స్ మరో  అప్డేట్ తో వచ్చారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ థండర్ ఆగస్ట్ 26న విడుదల కానుంది. పోస్టర్‌లో రామ్,  శ్రీలీల బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు
 
ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మొదటి రెండు పాటలు సంచలన విజయం సాధించాయి. ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ థండర్ మరింతగా అంచనాలని పెంచనుంది.
 
 శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్,  పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్.
 
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.