గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2023 (15:56 IST)

థాయిలాండ్ లో డబుల్ ఇస్మార్ట్‌ రెండో షెడ్యూల్ లో సంజయ్ దత్ ఎంట్రీ

Ram Pothineni, Puri Jagannadh, Charmi Kaur, Sanjay Dutt
Ram Pothineni, Puri Jagannadh, Charmi Kaur, Sanjay Dutt
ఉస్తాద్ రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్‌”.బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ఒక ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడంతో ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం రామ్ స్టైలిష్ మేకోవర్‌ అయ్యారు. విషు రెడ్డి సీఈవో.
 
ఈ చిత్రం రెండో షెడ్యూల్ థాయిలాండ్ లో ప్రారంభమైయింది. ఈ షెడ్యూల్లో హీరో రామ్, సంజయ్ దత్ పై  కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన సంజయ్ దత్ ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తన నటీనటులను బెస్ట్ మాస్ అప్పీలింగ్‌ లో ప్రజంట్ చేయడం లో స్పెషలిస్ట్ అయిన పూరి జగన్నాథ్ 'డబుల్ ఇస్మార్ట్‌' లో   సంజయ్ దత్‌ను మునుపెన్నడూ చూడని అవతార్‌లో చూపించనున్నారు. రామ్, సంజయ్ దత్‌లను తెరపై కలిసి చూడటం అభిమానులకు, సినీ ప్రియులకు ఎక్సయిటింగ్ గా ఉంటుంది. ఈ వైల్డ్ కాంబినేషన్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
 
ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో హై బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తారు మేకర్స్.
డబుల్ ఇస్మార్ట్  తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.