1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (13:34 IST)

ప్రభాస్‌ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల.. బంపర్ ఆఫర్‌ వచ్చేసిందిగా..!

Sreeleela
నటి శ్రీలీల యువ హీరోలతో పాటు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు వరుసగా విడుదల కాబోతున్నాయి. పోతినేని రామ్‌ సరసన నటించిన స్కంద చిత్రం ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీలీలకు మరో భారీ ఆఫర్ వచ్చింది. 
 
ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది.
 
"సీతా రామం" సినిమాతో బ్లాక్‌ బస్టర్ విజయం అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి రెబల్ స్టార్ ప్రభాస్‌కు కథ వినిపించాడని, అది ప్రభాస్‌కు నచ్చిందని టాలీవుడ్‌ సర్కిల్‌లో టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ ప్రాజెక్ట్‌‌ను నిర్మించే అవకాశం ఉంది.