గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2023 (12:32 IST)

కృతిశెట్టికి కష్టాలు.. ఉప్పెనలా వచ్చింది.. అలలుగా వెనక్కెళ్లిపోతోంది..!

krithi shetty
టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టికి కష్టాలొచ్చాయి. ఉప్పెన సినిమాతో బాగా పాపులర్ అయిన కృతిశెట్టి ప్రస్తుతం దురదృష్టం వెంటాడుతోంది. ఉప్పెనతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న కృతిశెట్టి.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో తేలిపోయింది. అందరూ గోల్డెన్ లెగ్ అనుకున్న ఈమె ప్రస్తుతం హ్యాట్రిక్ కొట్టడంలో వెనకబడిపోయింది. 
 
ఇతర యంగ్ హీరోయిన్ల ప్రభావంతో బేబమ్మకు ఆడపాదడపా ఆఫర్లు వచ్చినా వాటిని వదులుకోకుండా ముందుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో ఆమె నటిస్తోంది. 
 
అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం బెస్ట్ రోల్స్ ఎంచుకుని టాలీవుడ్‌పై దృష్టి పెట్టాలని ఆశిస్తున్నారు. మరి కృతి శెట్టి ఎలా తన అందచందాలతో అవకాశాలను అందిపుచ్చుకుంటుందో చూద్దాం.