సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 మే 2024 (17:31 IST)

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ షూటింగ్ పూర్తి

Priyadarshi, Nabha Natesh
Priyadarshi, Nabha Natesh
పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా, శ్రీమతి చైతన్య సమర్పణలో, వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి హీరోగా రూపొందుతున్న చిత్రం 'డార్లింగ్'.  నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ కి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇటివలే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ కు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయనున్నారు. హను-మాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
 
పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్ చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.