1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:56 IST)

ఉత్తరప్రదేశ్‌లో రాహుల్, ప్రియాంకా గాంధీ.. రైతు కుటుంబాలకు పరామర్శ

Lakhimpur Kheri
ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన రైతు మరణాలు దేశంలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

తాజాగా లఖీమ్‌పూర్‌ ఖేరీ పర్యటనకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు.
 
లక్నో విమానాశ్రయం నుంచి తన సొంత వివాహంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ బయల్దేరుతుండగా.. సొంత వాహనంలో వెళ్లడం కుదరని.. పోలీస్ వాహనంలోనే వెళ్లాలని ఆయన్ని పోలీసులు అడ్డగించారు. "నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు. నేను నా సొంత వాహనంలో వెళ్తాను" అంటూ రాహుల్ గాంధీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాకు దిగారు.
 
‘నా వాహనంలో వెళ్లేందుకు అనుమతించేవరకు ఇక్కడ నుంచి కదలను. రైతులను దోచుకోవడమే కాకుండా.. వారిని అణిచివేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’ అంటూ రాహుల్ గాంధీ ఫైర్ కావడంతో దిగొచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించారు. దీనితో రాహుల్ గాంధీ లక్నో విమానాశ్రయం నుంచి బయల్దేరి సీతాపూర్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న ప్రియాంక గాంధీని కలుసుకున్నారు.