1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (22:59 IST)

లఖిమ్‌పూర్‌ ఘటన: సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్‌పూర్‌ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. లఖింపూర్‌ ఘటనను సుమోటోగా స్వీకరించింది అత్యున్నత న్యాయస్థానం. గురువారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాదనలు వింటుంది. 
 
లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్రమంత్రి కుమారుడు నడిపిన కారు ఢీకొని రైతులు మరణించడం,ఆ తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని ఉత్తరప్రదేశ్ లాయర్లు భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ ఎన్వీ రమణని మంగళవారం ఓ లేఖ ద్వారా కోరిన విషయం తెలిసిందే. మరోవైపు, లఖిమ్‌పూర్‌ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఆందోళన ఉధృతం చేసిన సమయంలో దీనిపై నేరుగా సుప్రీంకోర్టు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం బుధవారం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హింసలో మరణించిన ఎనిమిది మందిలో ఉన్న జర్నలిస్టుకు కూడా అదే ఎక్స్‌గ్రేషియా వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. 
 
లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు మరియు జర్నలిస్టులకు తాను ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ప్రకటించాను" అని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లక్నో విమానాశ్రయంలో పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. పంజాబ్ మరియు ఛత్తీస్‌గఢ్ రెండూ కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి.