బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (14:02 IST)

లఖింపూర్ ఖేరి ఘటనపై సుప్రీం విచారణ రేపటికి వాయిదా

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదావేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా కమిషన్‌ వేశామని కోర్టుకు యూపీ సర్కార్‌ తెలుపడంతో సుప్రీంకోర్టు రేపటికివాయిదావేసింది. దీంతో శుక్రవారంలోగా ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించిన సుప్రీం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
 
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ వాహనం. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణలో మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ ఘటనపై విచారణ జరిపింది.