శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:14 IST)

24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా కేసులు.. 209 రోజుల్లో?

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 209 రోజుల్లో ఇదే అత్యల్పం. అయితే ఒకే రోజులో 263 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 29,639గా ఉన్నట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. 
 
కరోనా వల్ల ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 4,49,260గా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. గత 24 గంటల్లో 72,51,419 మందికి కోవిడ్ టీకాలు వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 91.54 కోట్లుగా ఉంది.