శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (23:28 IST)

దేశంలోనే తొలి 3డీ గృహం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి

3D printed home
దేశంలోనే తొలి 3డీ గృహాన్ని ఏర్పాటు చేసే దిశగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంకా 21 రోజుల్లో ఈ నిర్మాణం చేపట్టాలని మహీంద్రా గ్రూప్ చెప్తోంది.
 
ముంబైకి చెందిన బిజినెస్ మొగల్ ఐఐటీ మద్రాస్ మద్దతుగల స్టార్ట్అప్ త్వాస్తా 21 రోజుల్లో నిర్మించిన భారతదేశపు మొదటి 3డి ప్రింటెడ్ ఇంటికి సంబంధించిన ఒక 104 సెకన్ల నిడివి గల వీడియోను ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా 3డి ప్రింటెడ్ గృహా రంగంలో జరుగుతున్న పరిణామాలను తాను అనుసరిస్తున్నానని, ఈ రంగంలో స్వదేశంలో అభివృద్ది చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం భారతదేశానికి కీలకమని మహీంద్రా అన్నారు. 
 
ఐటి మద్రాస్ మద్దతుతో వచ్చిన టెక్ కంపెనీ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేయడం భారతదేశానికి చాలా అవసరమని తెలిపారు.