శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (13:37 IST)

బీజేపీ తీర్థం పుచ్చుకున్న తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్

తెలంగాణలో టీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పలేదు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపల్ ఛైర్మన్ మధు మోహన్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఇంఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 
 
ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. మధు మోహన్‌తో పాటు ఆయన అనుచరులు కూడా కాషాయ కండువాలు కప్పుకున్నట్లు తెలుస్తోంది.
 
కాగా గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి కౌన్సిలర్‌గా గెలిచిన మధు మోహన్ అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరి మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు.