బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (18:40 IST)

కేటీఆర్‌కు కౌంటరిచ్చిన కిషన్ రెడ్డి.. ఒవైసీతో పొత్తు..?

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోరాటం జరుగుతోంది. ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
 
తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. "పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం" అన్న  ఒవైసీ, ఎంఐఎంతో  సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు కలిసి పొత్తుపెట్టుకోవడం వారి మాటలను సమర్దించినట్టేనని ఫైర్ అయ్యారు.  
 
ఇదిలా వుంటే టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. సమతామూర్తి విగ్రహావిష్కరణ వివక్షకు నిలువెత్తు నిదర్శనమని, సమతామూర్తి స్ఫూర్తికే విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ట్యాగ్‌తో కేటీఆర్‌ ఒక ట్వీట్‌ చేశారు.