శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:37 IST)

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి జరిగింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కారుపై గుడ్లతో దాడికి పాల్పడ్డారు ఎన్ఎస్‌యూఐ సభ్యులు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిష‌న్ రెడ్డి వాహ‌నాన్ని అడ్డుకున్నారు. ఆపై కారుపై కోడిగుడ్లు కొట్టారు.
 
ఎన్ఎస్‌యూఐ సభ్యులు చ‌ర్య‌తో ఆగ్రహించిన మంచిరెడ్డి అనుచ‌రులు..గన్ వెమన్ వెంటనే కారు దిగి మరీ వారిని అడ్డుకున్నారు. అనంతరం వారిని ప‌ట్టుకుని చితక్కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో సాగర్ హైవేపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కారుపై గుడ్లతో దాడికి సంబంధించిన వీడియోలు బ‌య‌ట‌పడ్డాయి.