బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (19:07 IST)

ఏప్రిల్ ఒకటో తేదీన పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్" రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల చేసేలా ప్లాన్ చేశారు. 
 
మరోవైపు, ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న "ఆర్ఆర్ఆర్‌"తో పాటు "భీమ్లా నాయక్", "ఆచార్య" చిత్రాల విడుదల తేదీలను సోమవారం ప్రటించారు. మార్చి 25వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించగా, ఏప్రిల్ ఒకటో తేదీన "భీమ్లా నాయక్", ఏప్రిల్ 25వ తేదీన "ఆచార్య" చిత్రాలు విడుదలకానున్నాయి. 
 
ఇటీవల రెండు విడుదల తేదీలను "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందం ప్రకటించింది. అయితే, తాజాగా ఆ రెండు కాకుండా కొత్త తేదీని వెల్లడించింది. మార్చి 25వ తేదీన ఖచ్చితంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత డీవీవీ దానయ్య ప్రకటించారు. 
 
అప్పటికి కరోనా కొద్దగా నెమ్మదించి అన్ని థియేటర్స్ తెరుచుకుంటాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, మార్చి నెలలో పెద్ద సినిమాల హడావుడి బాగానే కనిపిస్తుంది. అయితే "ఆర్ఆర్ఆర్" దెబ్బకు ఈ చిత్రాలు విడుదల చేస్తారో లేదో వేచి చూడాల్సివుంది. 
 
మరోవైపు, పనన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్", చిరంజీవి నటించిన "ఆచార్య" చిత్రాల విడుదల విడుదల తేదీలను కూడా నిర్మాతలు ప్రటించారు. ఏప్రిల్ ఒకటో తేదీన "భీమ్లా నాయక్", ఏప్రిల్ 25వ తేదీన "ఆచార్య" చిత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు.