బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 జనవరి 2022 (09:48 IST)

ఓటీటీలో ప్రభాస్ - పూజా హెగ్డేల "రాధేశ్యామ్"?

ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం "రాధేశ్యామ్". పూజా హెగ్డే హీరోయిన్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ ప్రేమ కావ్యం సంక్రాంతి పండుగకు విడుదల కావాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విడుదలను వాయిదావేశారు. రూ.350 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ప్రేమకథ. తాను మనసిచ్చిన ఒక అమ్మాయి జాతకమేమిటో తెలిసిన హీరో, ఆమెను దక్కించుకోవడానికి చేసిన సాహసమే ఈ చిత్రం కథ. 
 
సంక్రాంతి తర్వాత విడుదల చేసేలా ప్లాన్ చేశారు. కానీ, కరోనా తీవ్రత పెరుగుతూ వెళుతుండటంతో ఈ చిత్రాన్ని మరికొంత కాలం వాయాదా వేసేందుకు నిర్మాతలు సాహసం చేయడం లేదు. అప్పటికీ వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయాన్ని నిర్మాణ సంస్థల యూపీ క్రియేషన్స్, టి.సిరీస్, గోపికృష్ణ మూవీస్‌లు అధికారికంగా వెల్లడించాల్సివుంది.