బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 20 జనవరి 2022 (14:40 IST)

మా అంకుల్... ది రెబల్ స్టార్ కృష్ణం రాజుకు శుభాకాంక్ష‌లు

Radheshyam location
రెబల్ స్టార్ కృష్ణం రాజు జ‌న్మ‌దినం నేడే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాజాగి న‌టించిన రాధేశ్యామ్ టీమ్ ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇందులో ఆయ‌న జాత‌కాలు చెప్పే గొప్ప పండితుడు. కాషాయ‌రంగు దుస్త‌ులు, మెడ‌లో రుద్రాక్ష‌లు ధ‌రించిన గెట‌ప్‌కు ఇప్ప‌టికే మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. కృష్ణంరాజు, ప్ర‌భాస్ క‌లిసి బిల్లా వంటి చిత్రాల్లో న‌టించిన రాధే శ్యామ్ ఎవ‌ర్‌గ్రీన్ సినిమా అవుతుంద‌ని ప్ర‌భాస్ తెలియ‌జేస్తున్నాడు. 
 
Krishnam Raju, Prabhas
గురువారంనాడు త‌న పెదనాన్న‌ బర్త్ డే సందర్భంగా ప్ర‌భాస్‌ కూడా తన సోషల్ మీడియాలో వెరీ స్పెషల్ విషెస్‌ని తెలియజేసాడు. తన భారీ సినిమా రాధేశ్యామ్ నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌తో మా అంకుల్ ది రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను, మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాని ప్రభాస్ తెలిపాడు. ఈ పోస్ట్‌కు ప్ర‌భాస్‌, కృష్ణంరాజు అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.